భక్తిశ్రద్ధలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు
ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపిన ఓనం పండుగ
కోల్ బెల్ట్ న్యూస్ (ఆర్మూర్):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం ఓనం పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టారు.
ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సమితి గురుస్వామి నగేష్ శర్మ ఆధ్వర్యంలో ముందుగా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు పంచామృతాలతో అభిషేకం చేసి, వేదమంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారగా, భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఓనం పండుగ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమం భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. అనంతరం భక్తులు, అయ్యప్ప స్వామి సేవా సమితి సభ్యులు పరస్పరం ఓనం పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు పుట్టి మురళి, కార్యదర్శి మీసాల రవి, కోశాధికారి గజారెడ్డి నర్సారెడ్డి, ముఖ్య సలహాదారులు జనార్దన్ గౌడ్, బాలాజీ గంగామోహన్, గంట విప్లవ్, ఖందేష్ శ్రీనివాస్, మీసాల రాజేశ్వర్, నందు తదితరులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో ఓనం వేడుకలను విజయవంతంగా నిర్వహించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});