కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర బీజేపీ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రెండు రోజుల నిరాహార దీక్ష
దీక్ష కు మద్దతు గా నిలిచిన మైనార్టీ మోర్చా రాష్ట్ర కమిటీ
కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తెలంగాణలో విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షకు పార్టీ శ్రేణులు మద్దతు ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.15,000 కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పెండింగ్‌లో ఉంచిందని ఆరోపిస్తూ ఈ దీక్ష చేపట్టారు.
ఈ నిరాహార దీక్షలో భాగంగా బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ పాల్గొని రాంచందర్ రావుకు సంఘీభావం తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఆలస్యం చేయకుండా తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత విద్యకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎంతో కీలకమని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న మొత్తం బకాయిలను విడుదల చేయాలని, విద్యార్థుల విద్యకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని వారు స్పష్టం చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});