బీబీపేట్ పెద్ద చెరువుకు జలకళ
మరో నాలుగు అడుగులు నీరు చేరితే చెరువు నిండే అవకాశం బీబీపేట్ మండల రైతుల్లో ఆనందం కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని పెద్ద చెరువుకు వరద నీరు భారీగా చేరుతుండటంతో జలకళ సంతరించుకుంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో చెరువులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం చెరువులో నీటిమట్టం సుమారు 11 అడుగులకు చేరుకోగా, గతంతో పోలిస్తే ఒక అడుగు మేర నీరు పెరిగినట్లు స్థానికులు తెలిపారు. చెరువు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవాలంటే మరో నాలుగు అడుగుల మేర నీరు...