కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా అభిమానులు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ప్రతి సంవత్సరం చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని మండలంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అభిమానులు తెలిపారు. శివరామిరెడ్డిపల్లి, దోమకొండకు చెందిన మెగా అభిమానులు కొరివి నరసింహులు, దోమకొండ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నర్సింలు, రాజు, ఎల్లయ్య, రమేష్, స్వామి, రాజు, రమేష్ తదితర మెగా అభిమానులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});