యువజన నాయకుడు మహమ్మద్ ఇలియాస్ జన్మదిన వేడుకలు

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): తెలంగాణ రాష్ట్ర యువజన నాయకుడు మహమ్మద్ ఇలియాస్ జన్మదినం సందర్భంగా బీబీపేట్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లుగారి మహేష్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు అందజేశారు. విద్యార్థులు, రోగులకు అవసరమైన సహాయం అందించడం ద్వారా జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరుణ్ శర్మ, ఉప సర్పంచ్ చందుపట్ల...