CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 5:41 pm Posted By: coalbelt 24 News

యువజన నాయకుడు మహమ్మద్ ఇలియాస్ జన్మదిన వేడుకలు

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

తెలంగాణ రాష్ట్ర యువజన నాయకుడు మహమ్మద్ ఇలియాస్ జన్మదినం సందర్భంగా బీబీపేట్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లుగారి మహేష్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు అందజేశారు. విద్యార్థులు, రోగులకు అవసరమైన సహాయం అందించడం ద్వారా జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అరుణ్ శర్మ, ఉప సర్పంచ్ చందుపట్ల ప్రశాంత్, నాగరాజు, మ్యాదరి స్వామి, శివరాత్రి ప్రవీణ్, కనకరాజు, అన్వేష్ గౌడ్, వెంకటి, స్వామి, రంజిత్, కొరివి స్వామి, జనగామ మహేష్ తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});