డిజిటల్ వ్యవసాయంతో రైతులకు మెరుగైన సేవలు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):  సండ్రోన్‌పల్లి రైతువేదికలో శనివారం వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ నిర్వహించిన “డిజిటల్ వ్యవసాయం–రైతు సేవల్లో సాంకేతికత, ఆధునిక వ్యవసాయానికి కొత్త దిశ” అంశంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నూర్ సహాయ వ్యవసాయ సంచాలకులు బానోత్ ప్రసాద్ మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానం, మొబైల్ యాప్‌లు, ఇంటర్నెట్, ఉపగ్రహ చిత్రాలు, డిజిటల్ సేవలను వినియోగించడం ద్వారా వ్యవసాయాన్ని మరింత సులభతరం, సమర్థవంతం, లాభదాయకంగా మార్చడమే డిజిటల్ వ్యవసాయం లక్ష్యమని వివరించారు. రైతుల వివరాలు, భూమి,...