కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో శనివారం నూతనంగా కోర్టు భవనాన్ని రాష్ట్ర హై కోర్ట్ జడ్జి భీమపాక నగేష్ ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన కోర్టు పరిధిలోకి మందమర్రి సర్కిల్ పరిధిలోని మందమర్రి, రామకృష్ణాపూర్, దేవాపూర్, కాసిపేట పోలీస్ స్టేషన్ లకు సంబందించిన కేసులు న్యాయ పరిస్కారం కోసం రానున్నాయి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మందమర్రి కోర్టు న్యాయమూర్తిగా రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె నిరోష నియామకం అయ్యారు. ప్రస్తుతం ప్రతి శుక్రవారం మాత్రమే కోర్టు పనిచేయనుంది. నూతనంగా ప్రారంభమైన కోర్టుకు మందమర్రి పోలీస్ సర్కిల్ పరిధిలోని 2272 సివిల్, క్రిమినల్ తో పాటు ఇతరత్రా కేసులు మంచిర్యాల, బెల్లంపల్లి కోర్టు ల నుంచి బదిలీ చేసినట్టుగా సంబందిత కోర్టు అధికారులు వివరించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});