జర్నలిస్టుపై దాడిని ఖండించిన టీయూడబ్ల్యూజే
రవితేజపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలి టీయూడబ్ల్యూజే హెచ్–143 కో-కన్వీనర్ రేనుకుంట్ల శ్రీనివాస్ కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలానికి చెందిన ఆర్‌బీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ పుల్ల రవితేజపై జరిగిన భౌతిక దాడిని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే హెచ్–143) కో-కన్వీనర్ రేనుకుంట్ల శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేసి, చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. భూ సమస్యపై న్యాయం చేయాలని కోరుతూ బాధితులు...