యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందించడమే లక్ష్యం

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):  యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, శారీరక దృఢత్వంతో పాటు ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా BMR Karate Do Martial Arts Academy ఆధ్వర్యంలో ఈ నెల 23న మందమర్రిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మందమర్రిలోని శ్రీ లక్ష్మీ భవాని ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి చీఫ్ ఆర్గనైజర్ వెల్పుల వినయ్ మాస్టర్ నేతృత్వం వహించనున్నారు. BMR ఫౌండర్ బండారి సంతోష్, అకాడమీ కర్ర వెంకటేష్, జనరల్ సెక్రటరీ మామిడి శశికిరణ్ తదితరుల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు....