ప్రకృతి వ్యవసాయంతో నేలసారం పెరుగుతుంది
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం అదిల్‌పేట్ రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారి రాజశేఖర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించడంతో పాటు నేలసారాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. సహజసిద్ధమైన పద్ధతుల్లో సాగు చేయడం వల్ల నాణ్యమైన, ఆరోగ్యకరమైన పంటలను ఉత్పత్తి చేయడంతో పాటు మంచి దిగుబడులు సాధించవచ్చని సూచించారు. రైతులు తమ భూమి స్వభావం, నేలసారం, నీటి వసతులను పరిగణనలోకి తీసుకుని...