CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 10:03 pm Posted By: coalbelt 24 News

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): 

బీబీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీబీపేట శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,520 నగదు, మూడు సెల్‌ఫోన్లు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్బంగా బీబీపేట ఎస్సై మాట్లాడుతూ మండలంలో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడానికి కృషి చేస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు. యువత చెడు మార్గంలో వెళితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తప్పు చేసిన వారు ఏ స్థాయిలో ఉన్న సహించేది లేదన్నారు. సమస్య చట్టపరిధిలో ఉంటె పరిష్కరించడానికి తాము ఎప్పుడూ సిద్దంగానే ఉంటామన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});