ప్రజా సమస్యల పరిష్కారానికి ‘ఓపెన్ బాక్స్’

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు చెన్నూరు శాసనసభ్యులు, రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెన్నూరు క్యాంపు కార్యాలయంలో ప్రజల ఫిర్యాదులు, సమస్యలను స్వీకరించేందుకు ప్రత్యేకంగా **‘ఓపెన్ బాక్స్’**ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. చెన్నూరు నియోజకవర్గంలోని ప్రతి ఓటరు, ప్రతి కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడమే తన ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా ప్రతి...