పెరిగిన బంగారం.. వెండి ధరలకు భారీ జంప్

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: హైదరాబాద్‌లో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,64,000గా నమోదైంది. గత రోజుతో పోలిస్తే రూ.1,400 పెరిగింది. ఆభరణాల తయారీలో సాధారణంగా వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,46,010గా నమోదైంది. మరోవైపు వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,50,900కు చేరింది. గత ధరతో పోలిస్తే సుమారు రూ.5,350 పెరిగింది....