కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
జిల్లాలోని మందమర్రి, బెల్లంపల్లి పట్టణాల్లో నూతన కోర్టు భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన న్యాయమూర్తి నగేష్ భీమపాకారం శుక్రవారం జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆయనకు ఘన స్వాగతం పలికారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అనంతరం జైపూర్‌లోని ఎన్‌టీపీసీ అతిథి గృహంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. వీరయ్యను హైకోర్టు న్యాయమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మొక్కలను అందజేసి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కోర్టు భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, న్యాయపరమైన అంశాలపై అధికారులు, న్యాయమూర్తులతో చర్చించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});