కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. ఈ విషయంపై విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జయస్‌వాల్ దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల విదేశీ పర్యటనలకు అనుమతి మంజూరు చేసే ముందు విదేశీ వ్యవహారాల శాఖ ఆయా పర్యటనలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తుందని ఆయన తెలిపారు. పర్యటన ఉద్దేశం, నిర్వహిస్తున్న పదవి బాధ్యతలకు అనుగుణంగా ఉండేలా చూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి యూకే పర్యటనకు కేంద్రం అనుమతి ఇచ్చిందని జయస్‌వాల్ వెల్లడించారు. అయితే అమెరికా పర్యటనకు సంబంధించి నిర్దేశిత నిబంధనలు పాటించలేదని, అందుకే అనుమతి నిరాకరించినట్లు ఆయన స్పష్టం చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});