మందమర్రి, బెల్లంపల్లిలో నేడు కోర్టుల ప్రారంభం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మంచిర్యాల జిల్లాలోని మందమర్రి, బెల్లంపల్లి పట్టణాల్లో నూతన కోర్టు భవనాలను శనివారం ప్రారంభించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. వీరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, మంచిర్యాల జిల్లా పరిపాలన న్యాయమూర్తి నగేష్ భీమపాక చేతుల మీదుగా ఈ కోర్టులను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మందమర్రి పట్టణంలో శనివారం ఉదయం 9.30 గంటలకు కోర్ట్ ఆఫ్ జూనియర్స్ కం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ (జేఎఫ్‌సీఎం) కోర్టును ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు బెల్లంపల్లి...