CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 9:26 pm Posted By: coalbelt 24 News

మందమర్రి, బెల్లంపల్లిలో నేడు కోర్టుల ప్రారంభం

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): 

మంచిర్యాల జిల్లాలోని మందమర్రి, బెల్లంపల్లి పట్టణాల్లో నూతన కోర్టు భవనాలను శనివారం ప్రారంభించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. వీరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, మంచిర్యాల జిల్లా పరిపాలన న్యాయమూర్తి నగేష్ భీమపాక చేతుల మీదుగా ఈ కోర్టులను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మందమర్రి పట్టణంలో శనివారం ఉదయం 9.30 గంటలకు కోర్ట్ ఆఫ్ జూనియర్స్ కం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ (జేఎఫ్‌సీఎం) కోర్టును ప్రారంభించనున్నట్లు తెలిపారు.

అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు బెల్లంపల్లి పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనాన్ని ప్రారంభించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. వీరయ్య వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు న్యాయశాఖ అధికారులు, న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});