10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.1,62,600
కిలో వెండి రూ.2,45,550
కోల్ బెల్ట్ ప్రతినిధి:
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
హైదరాబాద్‌లో బంగారం ధరలు గురువారం భారీగా పెరిగాయి. క్యాప్స్ గోల్డ్ వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం, 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,62,600గా నమోదైంది. గత రోజు ధరతో పోలిస్తే ఏకంగా రూ.4,940 పెరిగింది.
ఆభరణాల తయారీలో సాధారణంగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,42,040గా నమోదైంది.
ఇక వెండి ధర కూడా భారీగా పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,45,550కు చేరింది. గత ధరతో పోలిస్తే సుమారు రూ.11,784 పెరిగినట్లు క్యాప్స్ గోల్డ్ వివరాలు వెల్లడిస్తున్నాయి. పెరుగుతున్న ధరలతో బంగారం, వెండి కొనుగోలుదారులపై అదనపు భారం పడుతోంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});