శిలాతోరణం వరకు కొనసాగిన భక్తుల క్యూలు..
నిన్న 76,464 మంది శ్రీవారి దర్శనం
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం ఏర్పాటు చేసిన అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు.
ఇదిలా ఉండగా, నిన్న 76,464 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.4.94 కోట్ల ఆదాయం లభించింది. అలాగే 36,913 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు
(adsbygoogle = window.adsbygoogle || []).push({});