ప్రతిభే ఆయుధంగా ముందుకు సాగాలి
ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా ఉచిత శిక్షణ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): పేద విద్యార్థుల ఆర్థిక పరిస్థితులు వారి ప్రతిభకు అడ్డంకి కాకూడదని, ప్రతిభను ఆయుధంగా చేసుకుని ప్రతి పేద యువతీ యువకుడు ప్రభుత్వ ఉద్యోగం సాధించే స్థాయికి ఎదగాలన్నదే కాకా ఫౌండేషన్ లక్ష్యమని కార్మిక, గనుల ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మందమర్రిలో కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రాన్ని బుధవారం వారు ప్రారంభించారు....