CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 7:10 pm Posted By: coalbelt 24 News

ప్రతిభే ఆయుధంగా ముందుకు సాగాలి

ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా ఉచిత శిక్షణ

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

పేద విద్యార్థుల ఆర్థిక పరిస్థితులు వారి ప్రతిభకు అడ్డంకి కాకూడదని, ప్రతిభను ఆయుధంగా చేసుకుని ప్రతి పేద యువతీ యువకుడు ప్రభుత్వ ఉద్యోగం సాధించే స్థాయికి ఎదగాలన్నదే కాకా ఫౌండేషన్ లక్ష్యమని కార్మిక, గనుల ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు.

మందమర్రిలో కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రాన్ని బుధవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి యువతపై ఖరీదైన కోచింగ్ భారం పడకూడదనే ఉద్దేశంతో ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించాలని సూచించారు.

యువత భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి

ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ సాధనలో ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ ప్రధాన ఆకాంక్షలని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతల్లో ఒకటని అన్నారు. రాజకీయ వ్యాఖ్యలకు దూరంగా ఉండి కెరీర్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. విదేశీ భాషలు నేర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు సాధించే అవకాశాలను కూడా యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

కాకా ఫౌండేషన్, ప్రభుత్వ శాఖలు అందిస్తున్న అవకాశాలను వినియోగించుకుని మందమర్రి నుంచి అధిక సంఖ్యలో ఎస్‌ఐ, కానిస్టేబుళ్లు ఎంపికై ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి, ఎంపీ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, కాకా ఫౌండేషన్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, యువత, పోటీ పరీక్షల అభ్యర్థులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});