సమస్యలతో సతమతమవుతున్న కాసిపేట 1ఏ గని కార్మికులు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):  కాసిపేట 1ఏ గనిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు బుధవారం పరిశీలించారు. సీఐటీయూ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ అల్లి రాజేందర్, బ్రాంచ్ అధ్యక్షులు ఎస్. వెంకటస్వామి కార్మికులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గని నూతనంగా ఏర్పడినందున అవసరమైన మౌలిక సదుపాయాల పనులను యాజమాన్యం వేగవంతం చేయాలని వారు డిమాండ్ చేశారు. సర్ఫేస్‌కు వచ్చిన జనరల్ అసిస్టెంట్ల బేసిక్ తగ్గుదలపై కోర్టు ఇచ్చిన తీర్పు వివరాలను కార్మికులకు వివరించారు. గత ఆర్థిక సంవత్సరం ముగిసి...