కాసిపేట–1 ఇంక్లైన్ గనిని తనిఖీ చేసిన డీడీఎంఎస్
కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ మందమర్రి ఏరియాలోని కాసిపేట–1 ఇంక్లైన్ గనిని డీడీఎంఎస్ (ఎలక్ట్రికల్) కమల్ చౌదరి సాధారణ తనిఖీల్లో భాగంగా బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా గనికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. డీడీఎంఎస్ కమల్ చౌదరికి గని మేనేజర్ సతీష్, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువా, పూల బొకేతో సన్మానించారు. తదుపరి గనిలోని వివిధ పని స్థలాలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ తనిఖీలో గని మేనేజర్ సతీష్, ఏరియా ఇంజనీర్ భగవత్ ఝా,...