CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 6:53 pm Posted By: coalbelt 24 News

కాసిపేట–1 ఇంక్లైన్ గనిని తనిఖీ చేసిన డీడీఎంఎస్

కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట): 

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ మందమర్రి ఏరియాలోని కాసిపేట–1 ఇంక్లైన్ గనిని డీడీఎంఎస్ (ఎలక్ట్రికల్) కమల్ చౌదరి సాధారణ తనిఖీల్లో భాగంగా బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా గనికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

డీడీఎంఎస్ కమల్ చౌదరికి గని మేనేజర్ సతీష్, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువా, పూల బొకేతో సన్మానించారు. తదుపరి గనిలోని వివిధ పని స్థలాలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.

ఈ తనిఖీలో గని మేనేజర్ సతీష్, ఏరియా ఇంజనీర్ భగవత్ ఝా, గ్రూప్ ఇంజనీర్ మాధవ్, రక్షణ అధికారి సురేష్, డిప్యూటీ మేనేజర్ వెంకటేష్, ఇంజనీర్లు శ్రీనివాస్, రామకృష్ణ, అండర్ మేనేజర్ దీపక్, సర్వేయర్ రవీందర్, సంక్షేమ అధికారి మీర్జా గౌస్ జీషాన్, వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్లు అశోక్ తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});