పత్తిలో పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): పత్తి పంటలో పంటల సరళి, పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఆదిల్‌పేట గ్రామంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పత్తి ఉత్పాదకత మిషన్ (ఎంసీపీ) కింద నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి ఎల్తూరి సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ పత్తిలో సరైన పంటల సరళి, అంతర పంటల ప్రాధాన్యత, నేల ఆరోగ్య పరిరక్షణపై రైతులకు వివరించారు. సమతుల్య ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు,...