మిషన్ భగీరథ పైప్‌లైన్ కోసం ఖాళీ బిందెలతో నిరసన

కోల్ బెల్ట్ న్యూస్ (బెల్లంపల్లి): బెల్లంపల్లి పట్టణంలోని 28  వార్డు హనుమాన్ బస్తీలో మిషన్ భగీరథ పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బస్తీ వాసులు బుధవారం ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బస్తీ ప్రజలు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా తమ బస్తీకి మాత్రం మిషన్ భగీరథ పైప్‌లైన్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పథకం ద్వారా పట్టణంలోని అనేక ప్రాంతాలకు పైప్‌లైన్లు అందించినప్పటికీ, వన్‌టౌన్‌ వెనుక...