సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): తెలంగాణలో మొఘల్ ఆధిపత్యం, స్థానిక భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని జిల్లా గౌడ సంఘం ఉపాధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మడిపల్లి వెంకటేష్ గౌడ్ అన్నారు. మంగళవారం మందమర్రి పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పాపన్న గౌడ్ బహుజనుల కోసం పోరాడిన వీరుడిగా తెలంగాణ ప్రజల జానపద సంప్రదాయంలో చిరస్థాయిగా...