కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
తెలంగాణలో మొఘల్ ఆధిపత్యం, స్థానిక భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని జిల్లా గౌడ సంఘం ఉపాధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మడిపల్లి వెంకటేష్ గౌడ్ అన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మంగళవారం మందమర్రి పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పాపన్న గౌడ్ బహుజనుల కోసం పోరాడిన వీరుడిగా తెలంగాణ ప్రజల జానపద సంప్రదాయంలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. సామాజిక, రాజకీయ అణచివేతకు వ్యతిరేకంగా అనుచరులతో కలిసి పోరాడారని, ఖిలాషాపూర్, తాటికొండ, షాపూర్ తదితర ప్రాంతాల్లో కోటలు నిర్మించి తన ఆధిపత్యాన్ని విస్తరించారని పేర్కొన్నారు.
వివిధ సామాజిక వర్గాల వారిని సైన్యంలో చేర్చుకుని మొఘల్ సైన్యాలతో అనేకసార్లు పోరాడిన గొప్ప యోధుడని కొనియాడారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయడం గౌడ కులస్తులకు గర్వకారణమన్నారు. కార్యక్రమంలో సౌళ్ల వెంకటగౌడ్, నోముల శ్రీనివాస్ గౌడ్, వీరగోని భాస్కర్ గౌడ్, బుర్ర ఆంజనేయులు గౌడ్, బండి శంకర్ గౌడ్, వీరేందర్ గౌడ్, తాళ్లపల్లి శంకర్ గౌడ్, గుడిసెల రాజా గౌడ్, కత్తి నరస గౌడ్, ప్రభాకర్ గౌడ్, గంగాధర్ గౌడ్, రాజకుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});