ఆలస్యంగా వరి సాగు వద్దు.. ఆరుతడి పంటలకే ప్రాధాన్యం

చెన్నూర్ సహాయ వ్యవసాయ సంచాలకులు భాను ప్రసాద్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు, వర్షాలు ఆలస్యంగా లేదా అసమానంగా కురిసే అవకాశం ఉన్నందున ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులు ఆలస్యంగా వరి సాగు చేయకుండా ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెన్నూర్ సహాయ వ్యవసాయ సంచాలకులు భానోత్ ప్రసాద్ సూచించారు. మంగళవారం మందమర్రి మండలం పొన్నారం గ్రామంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నీటి లభ్యతను ముందుగా అంచనా వేసుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని...