అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి

అదనపు కలెక్టర్ చంద్రయ్య కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత గడువులోగా వేగంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాతనపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్, డీఈఈ, ఏఈ, కౌన్సిలర్లతో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. వాటర్ ట్యాంక్ నిర్మాణం, అమ్మ గార్డెన్ ప్రాంతంలోని సీసీ రోడ్లు, డ్రైన్లు, వైకుంఠధామం పనుల పురోగతిని సమీక్షించారు. ప్రజలకు తాగునీరు, మౌలిక సదుపాయాలు...