సోమగూడెంలో పారిశుధ్య పనులు ప్రారంభం

గ్రామ సమస్యలపై ప్రజలు, యువజన సంఘాల ఒత్తిడి ఫలితం కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట): గ్రామంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని గత కొంతకాలంగా గ్రామ ప్రజలు, యువత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. గ్రామసభల్లో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. గ్రామంలోని ప్రతి వాడలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకున్న సీపీఐ(ఎం) భగత్‌సింగ్ యువజన సంఘం నాయకులు, సమస్యల పరిష్కారం కోసం నిరసనలు, శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్పందించిన అధికారులు, ప్రజా నిధులతో సోమవారం సోమగూడెం (క)...