గ్రామ సమస్యలపై ప్రజలు, యువజన సంఘాల ఒత్తిడి ఫలితం
కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
గ్రామంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని గత కొంతకాలంగా గ్రామ ప్రజలు, యువత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. గ్రామసభల్లో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.
గ్రామంలోని ప్రతి వాడలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకున్న సీపీఐ(ఎం) భగత్‌సింగ్ యువజన సంఘం నాయకులు, సమస్యల పరిష్కారం కోసం నిరసనలు, శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్పందించిన అధికారులు, ప్రజా నిధులతో సోమవారం సోమగూడెం (క) గ్రామపంచాయతీలో పారిశుధ్య పనులను ప్రారంభించారు. ఇందుకోసం ఏడుగురు తాత్కాలిక కార్మికులను నియమించి పారిశుధ్య పనులు చేపట్టారు.
అయితే గ్రామంలో పారిశుధ్య పనులు పూర్తిస్థాయిలో చేపట్టి, పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు అవసరమైన సంఖ్యలో మరింత మంది తాత్కాలిక కార్మికులను నియమించాలని గ్రామ ప్రజలు, యువజన సంఘం నాయకులు కోరారు. సమస్యల పరిష్కారానికి అధికారులు నిరంతరం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
జరుగుతున్న పారిశుధ్య పనులను సీపీఐ(ఎం) మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి, వార్డు సభ్యుడు అజ్మీరా శ్రీనివాస్ పరిశీలించారు. భగత్‌సింగ్ యువజన సంఘం నాయకులు కనుకుల రాకేష్, అజ్మీరా రాజా, చిలుముల శేఖర్, సాపట్ రాయమల్లు, బానోత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});