CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 9:03 pm Posted By: coalbelt 24 News

గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం

ఆగస్టు 20న ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం..
ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకావాలి
మందమర్రి ఎంపీడీవో రాజేశ్వర్ తెలిపారు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మందమర్రి మండలంలో చేపడుతున్న గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలపై ఈ నెల 20వ తేదీ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) రాజేశ్వర్ తెలిపారు. మందమర్రి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. సమావేశానికి జిల్లా హార్టికల్చర్‌ అండ్‌ సెరికల్చర్‌ అధికారి కె. అనిత ప్రత్యేక అధికారిగా హాజరై అధ్యక్షత వహించనున్నట్లు తెలిపారు.

మండలంలో అమలవుతున్న గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, సంబంధిత అంశాలపై సమావేశంలో సమీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశానికి గౌరవ సర్పంచులు, మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో రాజేశ్వర్ కోరారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});