ఆటో కార్మికుల బంద్‌కు మద్దతుగా వాల్ పోస్టర్ల విడుదల

కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట): ఆటో కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ సోమగూడెం అంజనీపుత్ర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లను విడుదల చేశారు. సోమగూడెం–కాసిపేట ప్రాంతానికి చెందిన ఆటో కార్మికుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమగూడెం అడ్డా అధ్యక్షుడు కాసు శ్రీనివాస్, మాజీ ఉపాధ్యక్షులు సీటీ రజలింగు, బూడిద రమేష్, సీనియర్ ఆటో డ్రైవర్లు రామటంకి లింగన్న, కోట్ల సత్తన్న, లక్ష్మణ్,...