కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట):
ఆటో కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ సోమగూడెం అంజనీపుత్ర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లను విడుదల చేశారు. సోమగూడెం–కాసిపేట ప్రాంతానికి చెందిన ఆటో కార్మికుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సందర్భంగా సోమగూడెం అడ్డా అధ్యక్షుడు కాసు శ్రీనివాస్, మాజీ ఉపాధ్యక్షులు సీటీ రజలింగు, బూడిద రమేష్, సీనియర్ ఆటో డ్రైవర్లు రామటంకి లింగన్న, కోట్ల సత్తన్న, లక్ష్మణ్, శంకర్, రమేష్, ప్రణయ్, మధు, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, ఆటో కార్మికుల హక్కుల కోసం స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటామని వారు తెలిపారు.
హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఆటో కార్మికులు పెద్ద సంఖ్యలో బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7.50 లక్షల మంది ఆటో కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలని కోరారు.“జై ఆటో డ్రైవర్… జై జై ఆటో డ్రైవర్… మంచిర్యాల జిల్లా ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి… తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి” అంటూ నినాదాలు చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});