సింగరేణి కార్మికుల సమస్యలపై స్పందించకుంటే సమ్మె తప్పదు
ఈ నెల 21న ఆర్‌ఎల్‌సీ తో చర్చలు చర్చలు విఫలమైతే సమ్మె తేదీ ప్రకటన ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి కార్మికుల సమస్యలపై యాజమాన్యం, ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఈ నెల 21వ తేదీ తర్వాత అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మె తేదీని ప్రకటిస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు, వేజ్‌బోర్డు సభ్యుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. కార్మికులు సమ్మెకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం మందమర్రి కేకేఓసీ ప్రాజెక్టు గేట్ వద్ద నిర్వహించిన ఏఐటీయూసీ...