బీబీపేటలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని బీబీపేట గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి పుట్టలో పాలు పోసి నాగదేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా నాగుల పంచమి వేడుకలను నిర్వహిస్తున్న ఈ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. నాగదేవతను పూజించి, ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటే కుటుంబాల్లో సుఖసంతోషాలు, శుభకార్యాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం....