CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 12:16 pm Posted By: coalbelt 24 News

బీబీపేటలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని బీబీపేట గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి పుట్టలో పాలు పోసి నాగదేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా నాగుల పంచమి వేడుకలను నిర్వహిస్తున్న ఈ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. నాగదేవతను పూజించి, ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటే కుటుంబాల్లో సుఖసంతోషాలు, శుభకార్యాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం.
ఈ సందర్భంగా కొరివి స్వామి మాట్లాడుతూ.. నాగుల పంచమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నాగదేవతను, ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాలని కోరారు. అమ్మవారి కృపతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});