ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె

ఆగస్టు 24 నుంచి సమ్మెకు మందమర్రి ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ సంఘం హెచ్చరిక కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి): ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 24వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు మందమర్రి ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం మందమర్రి పాత బస్టాండ్‌లో సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, సమ్మెకు సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు మొయ్య రాంబాబు మాట్లాడుతూ.....