ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి చెన్నూర్: చెన్నూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు, నాణ్యమైన భోజనం అందకపోవడం ఆందోళనకరమని రామిళ్ల రాధిక అన్నారు. విద్యార్థులకు శుభ్రమైన నీరు, పరిశుభ్రమైన వాతావరణం, పోషకాహారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు కనిపించడం, కలుషిత ఆహారం కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు బాధాకరమన్నారు. మంత్రి సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం సిగ్గుచేటని విమర్శించారు. త్వరలో చెన్నూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను సందర్శించి...