CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 10:58 pm Posted By: coalbelt 24 News

ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి చెన్నూర్:

చెన్నూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు, నాణ్యమైన భోజనం అందకపోవడం ఆందోళనకరమని రామిళ్ల రాధిక అన్నారు. విద్యార్థులకు శుభ్రమైన నీరు, పరిశుభ్రమైన వాతావరణం, పోషకాహారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మధ్యాహ్న భోజనంలో పురుగులు కనిపించడం, కలుషిత ఆహారం కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు బాధాకరమన్నారు. మంత్రి సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం సిగ్గుచేటని విమర్శించారు.

త్వరలో చెన్నూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను సందర్శించి తాగునీరు, భోజనం, పారిశుద్ధ్యం, వసతి, మరుగుదొడ్ల పరిస్థితులను పరిశీలిస్తామని తెలిపారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని రామిళ్ల రాధిక హెచ్చరించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});