సింగరేణి ఇనుప సామగ్రి తరలిస్తున్న వ్యాన్ స్వాధీనం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణికి చెందిన ఇనుప సామగ్రిని అక్రమంగా తరలిస్తున్న ఐచర్ వ్యాన్‌ను మందమర్రి ఎస్‌అండ్‌పీసీ (సెక్యూరిటీ) సిబ్బంది మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ కె. వెంకటేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెల్లంపల్లికి చెందిన స్క్రాప్ వ్యాపారి ఎస్.కె. సలీమ్ ఏపీ 15 టీబీ 4555 నంబర్ గల ఐచర్ వ్యాన్‌లో సింగరేణికి చెందిన ఇనుప సామగ్రిని తరలిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన కె. శ్రీనివాస్‌రావుకు విశ్వసనీయ సమాచారం అందిందన్నారు. ఈ సమాచారాన్ని ఆయన...