వర్షాల కోసం సామూహిక ప్రార్థనలు చేయాలని పిలుపు
కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ శివాలయానికి చేరుకుని నీటితో అభిషేకం చేయాలని కోరిన కొరివి నర్సింహులు కోల్ బెల్ట్న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో భగవంతుడి కరుణతో సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ సామూహిక ప్రార్థనలు నిర్వహించాలని కొరివి నర్సింహులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో బీబీపేట ప్రాంతంలో వర్షాలు కురవని సమయంలో గ్రామ ప్రజలంతా ఐక్యంగా పాత కసీర్ వద్ద ఉన్న శివాలయానికి చేరుకుని శివలింగానికి నీటితో అభిషేకం చేయగా,...