CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 8:47 pm Posted By: coalbelt 24 News

కార్మికుల హక్కులను కాలరాయొద్దు

సమ్మెలో పాల్గొంటే రూ.500 చెల్లించాలనడం సరికాదు: వాసాల సంపత్

కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కాంట్రాక్ట్ కార్మికులు తమ హక్కుల సాధన కోసం పోరాటం చేయడం ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన హక్కు అని టీడీపీ మందమర్రి పట్టణ అధ్యక్షుడు వాసాల సంపత్ అన్నారు. కార్మికుల హక్కులను అణచివేసే చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు.మంగళవారం మందమర్రి సివిల్ సప్లై కార్యాలయం వద్ద కాంట్రాక్ట్ కార్మికులను కలిసి వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు8. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ.. జాతీయ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు ఫిబ్రవరి 12న నిర్వహించిన ఒక్కరోజు టోకెన్ సమ్మెలో సుమారు 150 మంది కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారని తెలిపారు.
సమ్మెలో పాల్గొన్నందుకు ఒక్కో కార్మికుడు రూ.500 చెల్లించాలని సంబంధిత కాంట్రాక్టర్ వేధిస్తున్నట్లు ఆరోపించారు. సమ్మెలో పాల్గొంటే రూ.500 చెల్లించాలనే నిబంధన ఏ లేబర్‌ చట్టంలో ఉందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తే సింగరేణి అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు కార్మికులకు న్యాయం చేయాలని సింగరేణి అధికారులను డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో టీఎన్‌టీయూసీ నాయకులు కోడిపెల్లి రాజయ్య, పారుపల్లి శీను, కాంట్రాక్ట్ కార్మికులు సురేందర్, శ్రీను, లచ్చయ్య, దేవయ్య, ప్రశాంత్, రాజమల్లు తదితరులు పాల్గొన్నార




(adsbygoogle = window.adsbygoogle || []).push({});