తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 20 గంటలు
ఆక్టోపస్ భవనం వరకు క్యూలైన్లు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం సుమారు 20 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం భక్తులు ఆక్టోపస్ భవనం వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఇదిలా ఉండగా, నిన్న శ్రీవారిని 87,658 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.4.13 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే 40,606 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమలలో క్యూలైన్లను, దర్శన...