తెలంగాణ మీడియా రంగంలోకి మరో కొత్త దినపత్రిక

సీనియర్ జర్నలిస్టుల నేతృత్వంలో ‘ప్రభాత ఉదయం’ ప్రింట్‌తో పాటు డిజిటల్‌పై దృష్టి కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తెలంగాణ మీడియా రంగంలోకి మరో కొత్త దినపత్రిక అడుగుపెట్టబోతోంది. సీనియర్ జర్నలిస్టుల అనుభవం, నూతన ఆలోచనల సమ్మేళనంగా ‘ప్రభాత ఉదయం’ పేరుతో కొత్త దినపత్రిక త్వరలో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ పత్రికకు సీనియర్ జర్నలిస్ట్ కట్టా శేఖర్‌రెడ్డి నేతృత్వం వహించనుండగా, మరో సీనియర్ జర్నలిస్ట్ వేమూరి వంశీకృష్ణ పబ్లిషర్‌గా వ్యవహరించనున్నారు. కట్టా శేఖర్‌రెడ్డి గతంలో ఆంధ్రజ్యోతిలో సుదీర్ఘకాలం జర్నలిజం అనుభవాన్ని సంపాదించారు. నమస్తే తెలంగాణ...