మియాపూర్‌లో పేలుడు.. నలుగురికి గాయాలు
ఐస్‌క్రీమ్ బండి నిర్వాహకుడి పరిస్థితి విషమం కోల్ బెల్ట్ న్యూస్ (హైదరాబాద్): మియాపూర్‌లోని జీఎస్‌ఎం మాల్ సమీపంలో శనివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. వారిలో ఐస్‌క్రీమ్ బండి నిర్వహిస్తున్న యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడులో గాయపడిన వారిలో ఓ కాలేజీ విద్యార్థిని, ఓ ఐటీ ఉద్యోగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు ఘటనాస్థలికి...