సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ ఆర్థిక సాయం

కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి అండగా నిలిచేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ తరఫున సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి మొత్తం రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ సీనియర్లు, వరంగల్‌ జిల్లా ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. సుదర్శన్‌రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తు, విద్య, కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి చెరో రూ.కోటి చొప్పున బ్యాంకు ఖాతాల్లో...