ఎల్పీజీ గ్యాస్ వినియోగంలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరి

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ఎల్పీజీ వంట గ్యాస్ వినియోగంలో భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించడం ద్వారా ప్రాణాలు, ఆస్తులను రక్షించుకోవచ్చని ఇండియన్ గ్యాస్ డివిజనల్ మేనేజర్ పాలకుర్తి రాజు తెలిపారు. శుక్రవారం మందమర్రి ఇండియన్ గ్యాస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రతా అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నిత్యం చోటుచేసుకుంటున్న గ్యాస్ లీకేజీ ప్రమాదాలను నివారించేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ప్రభుత్వ నిబంధనల మేరకు వినియోగదారులు కొన్ని ప్రాథమిక భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సిలిండర్‌ను స్వీకరించే సమయంలో...